Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులను.. మళ్లీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ- బంజారా హిల్స్
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు రామ చంద్రభారతి, నంద కుమార్‌కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే గురువారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలై వస్తున్న వారిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. బోగస్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే భూమి వ్యవహారంలో బెదిరింపులు చేశారని దోమ మండలానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు నందకుమార్ మీద ఐపీసీ 386, 387 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రామచం ద్రభారతి, నందకుమార్‌లను అదుపులోకి తీసు కున్న పోలీసులు.. వారికి బంజారాహిల్స్‌లోని షౌకత్నగర్ ప్రభుత్వ వైద్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కోర్టు రామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసింది. అలాగే రూ. 10 వేల షూరిటీలు రెండు సమర్పిం చాలని ఆదేశించింది. నందకుమార్‌కు మాత్రం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో నందకుమార్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో నిందితుడైన సింహ యాజీ ఇప్పటికే జైలు నుంచి విడుదలయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్యేల కొను గోలు కేసులో బీఎల్ సంతోష్ తుషార్, జగ్గు స్వామిని నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. దాంతో సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, పోలీసు, సిట్‌కు అధికారం లేదన్న కోర్టు నిర్ణయంపై రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉంది.