Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ ప్రకటించిన జాతీయ ఇంధన పొదుపు అవార్డుల్లో ఏడింటిని దక్షిణ మధ్య రైల్వే కైవసం చేసుకుంది. రైల్వే స్టేషన్ల విభాగంలో కాచిగూడ రైల్వే స్టేషన్ మొదటి బహుమతిని దక్కించుకున్నది. 2022 ఏడాదిలో ఇంధన పొదుపు కోసం తీసుకున్న చర్యల ఆధారంగా అవార్డుల ఎంపిక జరిగింది. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయ నున్నారు. దక్షిణ మధ్య రైల్వే 11 ఏండ్లుగా విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను అందు కుంటున్నది. ఇంధన శక్తి పరి రక్షణ కోసం చేపట్టే వివిధ వినూత్న, సమర్థవంత చర్యలను తీసుకుంటూ వాటిని అమలు చేయడం మూలాన జోన్ ఈ అవార్డులను అందు కోవడంలో సహాయపడింది. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజ నీర్, హైదరాబాద్, విజయ వాడ, గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఎలక్ట్రికల్ డిపా ర్ట్మెంట్ అధికారులు, సిబ్బం దిని ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.
విభాగాల వారీగా అవార్డులివే
1. రైల్వే స్టేషన్ల విభాగం
- కాచిగూడ రైల్వే స్టేషన్ మొదటి బహుమతిని గెలుచుకుంది
- గుంతకల్ రైల్వే స్టేషన్ రెండో బహుమతిని గెలుచుకుంది
2. విజయవాడ డివిజన్లోని మూడు రైల్వే స్టేషన్లకు
మెరిట్ /ప్రతిభ సర్టిఫికేట్లు
- విజయవాడ రైల్వే స్టేషన్
- రాజమండ్రి రైల్వే స్టేషన్
- తెనాలి రైల్వే స్టేషన్
3. ప్రభుత్వ భవనల విభాగం
- రైల్వే హాస్పిటల్, గుంతకల్
- ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ( ఈటీటీసీ ), విజయవాడ