Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూఢత్వ భావనలను తిప్పికొట్టండి
- కోవిడ్ సాకుతో విద్యారంగం కార్పొరేట్ల మయం
- పీడీఎస్‌యూ మహాసభలో హేతువాద సంఘం జాతీయ అధ్యక్షులు నరేంద్ర నాయక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, మూఢత్వ భావనలు, అసత్య ప్రచారాలతో దేశం తిరోగమనం వైపు వెళ్తున్నదనీ, ఈ ధోరణిని ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ తిప్పికొట్టే యువతదే భవిష్యత్ అని హేతువాద సంఘం జాతీయ అధ్యక్షులు నరేంద్ర నాయక్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర 22వ మహాసభ రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ..అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా పోరాడా లని పిలుపునిచ్చారు. చరిత్ర వక్రీకరణ వేగంగా జరుగుతున్నదనీ, చివరకు సినిమాలు, డాక్యుమెంటరీ ల్లోనూ దాన్ని జొప్పిస్తున్న తీరును వివరించారు. రాకెట్లు, ఆటంబాంబులు, ప్లాస్టిక్ సర్జరీలు పురాతన కాలంలో ఉన్నాయని సంఘపరివార్ శక్తులు వాదిం చడం విడ్డూరంగా ఉందనీ, తమ అసత్యప్రచారాల తో పిల్లల మెదళ్లను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కులం, మతం పేరుతో విద్యార్థుల మధ్య విభజన తెస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాందేవ్‌బాబా ఉత్పత్తులు ప్రామాణికం కాదన్నారు. ఆయన్ను దేవుడితో పోలుస్తూ కొందరు వాదించడం దుర్మార్గమన్నారు. కోవిడ్ సాకును చూపెట్టి విద్యా రంగాన్ని కార్పొరేట్లకు పాలకులు కట్టబెడుతున్నారనీ, నూతన జాతీయ విద్యా విధానాన్ని దొడ్డిదారిన తీసుకొచ్చారని విమర్శించారు. దీంతో పేద పిల్లలు చదువులకు దూరం కావాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ, అశాస్త్రీయ భావాలు ఏంటో పసిగట్టే జ్ఞానాన్ని యువతను అలవర్చుకుని మెరు గైన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని పిలు పునిచ్చారు. మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ..మాటలతో మభ్యపెట్టి, మోసం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అంధకారంలోకి నెట్టుతున్నదని వాపోయారు. చీకటిని పారదోలే శక్తిగా యువత మారాలని పిలుపునిచ్చారు. వాగ్గేయ కళాకారుడు, కవి జయరాజు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని, దేశాన్ని రక్షించుకునే బాధ్యత యువతపై ఉందన్నా రు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 'ఇకపై మేం మూఢ నమ్మకాలు నమ్మబోం.. కుల, మతాలను పట్టించు కోం..ప్రకృతిని కాపాడుకుంటాం' అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎవరికైనా నల్లని తాడులు, జంజా లుంటే తొలగించాలని వేదిక నుంచి పిలుపునివ్వ గా...తన కాలుకు కట్టుకున్న నల్లని తాడును స్పందన అనే యువతి తెంచేసింది. దీంతో ఆమెకు ఆవని పుస్తకాన్ని జయరాజు బహుకరించారు. మహాసభ ప్రారంభం సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షు లు ఎస్.నాగేశ్వర్రావు ఆ సంఘం జెండాను ఆవిష్క రించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రాము సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్, విద్యా పరిరక్షణ కమిటీ కేంద్ర నాయకులు మనోహర్‌రాజు సౌహార్ద్ర సందేశాలి చ్చారు. ఈ సభలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, స్వాతి, కల్పన, పృద్వీ, సాయి, పీడీఎస్‌యూ సహాయ కార్యదర్శులు గణేశ్, ఎస్.అనిల్, నరేందర్, ఆజాద్, కోశాధికారి సంధ్య, తదితరులు పాల్గొన్నారు.