Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు అమరవీరుల జ్యోతి యాత్ర సభలో టి సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయరంగాన్ని రక్షించడంలో భాగంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్యఉద్యమాలు నిర్వహించాలని అమరవీరుల జ్యోతి యాత్ర ఉప నాయకులు, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యులు టి.సాగర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13 నుంచి 16 వరకు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో జరుగుతున్న ఏఐకేఎస్ మహాసభల జయప్రదం చేయాలని కోరారు. గురువారం తమిళనాడులోని హోసూరు, శూలగిరి, క్రిష్ణగిరి, కరిమంగళం, ధర్మపురి, నల్లంపల్లి, ఓమలూరు, రెడ్డిపట్టిల మీదుగా కొనసాగుతున్న అమరవీరుల జ్యోతి యాత్ర సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెేఎస్్) 35వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తామనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరిస్తామంటూ హామీ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏటా 10వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పారు.
ఏఐకెేఎస్ 35వ అఖిల భారత మహాసభల సందర్భంగా అమర వీరుల జ్యోతియాత్ర డిసెంబర్ 5న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్వగ్రామం కడవెండి (జనగామ జిల్లా) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్ర కేరళ రాష్ట్రంలోని త్రిసూల్ వరకు కొనసాగుతుందని చెప్పారు. యాత్రకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు,మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యాత్ర నాయకుడు కృష్ణప్రసాద్, మేనేజర్ ప్రకాశన్ మాస్టార్, తమిళనాడు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.