Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జియో సైంటిస్టుల 46వ ఓరియంటేషన్ కోర్సు ముగిసింది. ఈ మేరకు శక్రవారం హైదరాబాద్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియా (జీఎస్ఐ) కార్యాలయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేత నియమించబడిన 64 మంది జియో సైంటిస్టుల కోర్సు ముగింపు కార్యక్రమానికి జీఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజు అధ్యక్షత వహించారు. వీరంతా దాదాపు 11 నెలల పాటు దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో శిక్షణ పొందారు. హెడ్ మిషన్ 5, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ శిక్షణకాలంలో నేర్చుకున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలనీ, అంకితభావంతో పని చేయాలని తెలిపారు.డాక్టర్ రాజు మాట్లాడుతూ భౌగోళిక శాస్త్రవేత్తలే సంస్థ భవిష్యత్తు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐటీఐ డైరెక్టర్ ఆర్.విజయ్ కుమార్, హైదరాబాద్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ భాటియా తదితరులు పాల్గొన్నారు.