Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షర్మిల నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షకు దిగారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్‌కు తరలించారు. లోటస్ పాండ్ వద్ద షర్మిల దీక్ష కొనసాగిస్తూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచేస్తున్నారని ఆరోపించారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే అడ్డుకున్నారన్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై ఆమె నిరసన తెలిపారు. రోడ్డుపై దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిలను బలవంతంగా దీక్ష ప్రాంగణం నుంచి తీసుకు రావటంతో కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో కర్ఫ్యూ ఎందుకు విధించారని పోలీసులను ప్రశ్నించారు.