Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్దిపొందే మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేవని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మళ్లీ కొనసాగాలని ఏపీ సీఎం ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నేత సజ్జల రామకష్ణారెడ్డి వ్యాఖ్యానించడంలో కుట్ర కోణం దాగి ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలకు వస్తున్న భారీ ప్రజా స్పందన చూసి తట్టకోలేకే, ప్రజల దష్టి మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. మూడేండ్ల వైసీపీ పాలనలో అక్కడ ప్రజలు సీఎం జగన్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని గుర్తు చేశారు. దాడులు, దౌర్జన్యాలు ప్రజల ఆస్తులను లూటీచేసి భయభ్రాంతులకు ప్రజలను గురి చేస్తున్నా చంద్రబాబు పెట్టిన సభలకు స్వచ్ఛందంగా లక్షల మంది తరలి వస్తున్నారని వివరించారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనే ప్రజల బలమైన కోరిక స్పష్టంగా కనపడుతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వైసీపీ మళ్లీ మోసం చేయాలని చూస్తున్నదన్నారు. రెండు రాష్ట్రాల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధిపొందా లని చూస్తున్న టీఆర్ఎస్, వైసీపీ మాటలకు కాలం చెల్లిందన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.