Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ నివేదికను అందజేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సామాన్య, సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన తనిఖీ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) సుధా రాజన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నివేదికలో ప్రభుత్వ పద్దులు, లావాదేవీలకు సంబంధించి ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనలుంటాయి. రాష్ట్ర గవర్నర్ ఈ నివేదికను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచేలా చూస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.