Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆ పార్టీ ఆవిర్భవించిన కొన్ని గంటల వ్యవధిలోనే శుక్రవారం చల్లా ఆ పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిశారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చురుకైన నాయకుడు చల్లా వెంకట్రామిరెడ్డికి పార్టీలో తగిన స్థానం కల్పించి ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని సీఎం తెలిపారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూతురు కొడుకైన చల్లా వెంకట్రామిరెడ్డి తండ్రి చల్లా రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు.
సీఎంకు బాజిరెడ్డి శుభాకాంక్షలు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజీరెడ్డి గోవర్థన్ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలు సుకున్నారు. ముఖ్యమంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.