Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నేషనల్ మీన్స్ కం మెరిట్' స్కాలర్షిప్ పథకం అర్హత కోసం పరీక్ష రాసేవారికి హాల్టిక్కెట్లను శుక్రవారం నుంచి అందజేస్తున్నారు. ఇప్పటికే పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు http//bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 163 కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదో తరగతి చదివే 32,899 మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. అర్హత సాధించే వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున, ఇంటర్మీడియేట్ చదివే వరకూ సహాయం అందుతుంది. గతేడాది ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్రంలో 21,132 మంది రాశారు. వారిలో 2,441 మంది అర్హత సాధించారు.