Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ఆవిర్భావం దేశానికి ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందని ఆపార్టీ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడొక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ నాయకత్వంలో నవశకం ఆరంభమైందనీ, తెలంగాణ అభివృద్ధి మోడల్‌తో దేశ ప్రజలకు సుపరిపాలన అందించే సత్తా ఆయనకు ఉందన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి, సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా పార్లమెంటులో తన వద్దకు ప్రత్యేకంగా వచ్చి తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్తో దేశ రైతాంగం బంగారు భవిష్యత్ అవుతుందనీ, వారికి మరింత మేలు జరుగుతుందని ఆన్నారు.