Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు శుక్రవారం హైదరాబాద్‌లోని మినిష్టర్స్ క్వార్టర్లో మంత్రి సత్యవతి రాథోడ్ ల్యాప్‌టాప్‌లతో పాటు నగదు ప్రోత్సాహకాన్ని అందిం చారు. ప్రయివేటుకు ధీటుగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్న దని తెలిపారు. దేశానికే రాష్ట్ర గురుకులాలు ఆదర్శంగా నిలుస్తున్నా యన్నారు.
కేజీ టూ పీజీ ఉచిత విద్యను గురుకులాల్లో అందిస్తున్నామని చెప్పారు. గతంతో పోలిస్తే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. ప్రతిభా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీలకు ఉచిత నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది వందల మంది జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో అడ్మిషన్ పొందుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి. ఓఎస్ డి రంగారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.