Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.354 కోట్ల వ్యయం :సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలో కార్మికుల కోసం రూ.354 కోట్ల వ్యయంతో అదనంగా 643 క్వార్టర్లు నిర్మాణం చేపట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం నాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఇండ్ల నిర్మాణాలను 18నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు 1,853 కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 2018 ఫిబ్రవరి 27న శ్రీరాం పూర్లో జరిగిన సింగరేణీ యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సింగరేణి ఉద్యోగులకు పాత క్వార్టర్ల స్థానంలో కొత్తగా డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణాన్ని ఇస్తామని హామీ ఇచ్చారనీ, దాని భాగంగా తొలి దశ నిర్మాణాలు పూర్తి అయ్యాయనీ, ఇప్పుడు రెండో దశ నిర్మాణాలు చేపడుతు న్నామన్నారు. భూపాలపల్లి, కొత్త గూడెం, ఆర్జీ-3 ఏరియా, సత్తు పల్లి ప్రాంతాల్లో 1853 క్వార్టర్లను నిర్మించినట్టు తెలిపారు. సంస్థలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 49,919 క్వార్టర్లు అందుబాటులో ఉన్నాయనీ, కొత్త గా గనులు విస్తరిస్తున్న ప్రాంతా ల్లో, కాలం చెల్లిన క్వార్టర్ల స్థానం లో ఆధునిక డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మిస్తున్నామన్నారు.