Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
నవతెలంగాణ- భూదాన్ పోచంపల్లి
ఎన్పీఆర్డీ అఖిలభారత 3వ మహాసభ ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామపంచాయతీ పరిధిలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో జరగనున్నది. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. అనేక వికలాంగుల ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఎన్పీఆర్డీ అఖిలభారత మూడో మహాసభను మొదటిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభకు దేశవ్యాప్తంగా 500 మంది వికలాంగుల ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతున్నారని చెప్పారు. వికలాంగుల సాధికారత, సంక్షేమం, వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలు వంటి అనేక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఈనెల 27న దేశ్ముఖిలోని డాక్టర్ భారతిరావు రిహాబిలిటేషన్ సెంటర్లో 'వికలాంగుల సంక్షేమం- సాధికారత'పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సెమినార్‌కు కేరళ రాష్ట్రం సోషల్ జస్టిస్ మినిస్టర్ డాక్టర్ ఆర్.బిందు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కె.వాసుదేవ రెడ్డి, పశ్చిమబెంగాల్ విద్యా శాఖ మాజీ మంత్రి, ఎన్పీఆర్డీ అఖిలభారత అధ్యక్షులు కాంతి గంగూలి, ప్రధాన కార్యదర్శి మురళీధరన్ హాజరవుతున్నట్టు చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వెంకట్, కోశాధికారి ఆర్.వెంకటేష్, చీఫ్ ప్యాట్రాన్ టి.జ్యోతి, వైస్ చైర్మెన్ ఎండి.జహంగీర్, కొండమడుగు నరసింహ, రిహాబిలిటేషన్ సెంటర్ ఇన్‌చార్జ్జి రాజశేఖర్, నాయకులు టి.వరమ్మ, స్వరూప, ప్రకాష్, బొల్లేపల్లి స్వామి, వనం ఉపేందర్, వెంకటేష్, అంజిరెడ్డి ఉన్నారు.