Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మత్య్సకారుల ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియో వెంటనే మంజూరు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన, తీవ్రంగా గాయపడిన మల్య్సకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ రూ.10లక్షలు, ఎక్స్‌గ్రేషియో రూ.10లక్షలు రైతు బీమా మాదిరిగా విడుదల చేయాలని కోరారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మత్స్యశాఖ కమిషనరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా మాట్లాడుతూ.. వైద్యం చేయించుకోలేక అనారోగ్య కారణాలతో, గుండెపోటు, పక్షవాతం, ఇతర రోగాలతో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రైతుబీమా పథకం మాదిరిగా ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.20లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2020-2021లో ఫిష్కో ఫెడ్ వద్ద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేక పెండింగ్‌లో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలన్నారు. మత్స్యకారులకు రైతు బీమా వస్తే.. మత్స్యకార శాఖ ద్వారా ఇచ్చే ఎక్స్‌గ్రేషియోను రద్దు చేయడం సరైంది కాదన్నారు. అనంతరం మత్స్యశాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చనమోని శంకర్, ముఠా విజయ, నాయకులు ముఠా దశరథ్, పూలగాజుల జంగయ్య, జిలమోని ముత్తమ్మ, తవిటి యాదగిరి, గిరిప్రసాద్, కూర రాములమ్మ, గొట్ట శ్రీను తదితరులు పాల్గొన్నారు.