Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. అధునాతన హంగులతో స్టేషన్లను తీర్చిదిద్దెందుకు వీలుగా రైల్వే మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్లో పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.గిర్ధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పనులను చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో అక్టోబర్, 2022లో కేటాయించినట్టు పేర్కొన్నారు. 36 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.699 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.