Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కిడ్నీ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత డయాలసిస్ సెషన్లు 50 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. 'రాష్ట్రావిర్భావం తర్వాత కిడ్నీ రోగుల కోసం అందిస్తున్న డయాలసిస్ కేంద్రాల ద్వారా రోగులు రూ.700 కోట్ల విలువైన సేవలను అందుకున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు డయాలసిస్ కేంద్రాలు మూడు మాత్రమే ఉండగా, తెలంగాణ వచ్చాక వాటి సంఖ్యను 82కు పెంచారు. మారుమూల ప్రాంతాల్లో సైతం డయాలసిస్ సేవలందుతున్నాయి.