Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి
- అనంతరం ఆత్మహత్యాయత్నం
- ముగ్గురి పరిస్థితి విషమం
నవతెలంగాణ-మియాపూర్
ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెడుతోందని ఆమెపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదానికి పాల్పడ్డాడు. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి, అనంతరం తానూ పొడుచుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన శోభ, ఆమె కూతురు వైభవి కుటుంబసభ్యులతో కలిసి మియాపూర్ న్యూ హాఫిజ్పేట్లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే వైభవి, వైజాగ్‌కు చెందిన సందీప్ మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తేలియడంతో వీరిని మందలించారు. దాంతో వైభవి సందీప్‌ను దూరం పెట్టి, అతని ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసింది. అయినా సందీప్ ఇతర నెంబర్లతో కాల్ చేసి తనతో మాట్లాడాలని వేధిస్తుండేవాడు. మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేదా చంపేస్తానని మెసేజ్‌లు చేస్తూ భయపెడుతుండేవాడు. దాంతో వైభవి, సోదరుడు, తల్లితో కలిసి మే నెలలో నగరానికి వచ్చి ఇక్కడే ఉంటోంది.