Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యా కమిషనర్‌కు టిప్స్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెరిట్ విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎంసెట్, నీట్, జేఈఈ కోచింగ్‌ను అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఇవ్వాలని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) కోరింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌ను మంగళవారం హైదరాబాద్‌లో టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. డీఐఈవో, నోడల్ అధికారుల పోస్టు రాష్ట్రస్థాయిదనీ, ప్రిన్సిపాళ్ల ఇంటిగ్రేటెడ్ సీనియార్టీ ప్రకారమే ఇంచార్జీ లేదా ఎఫ్ఏసీ ఇవ్వాలని కోరారు. ఇంటర్ బోర్డుకు డిప్యూటేషన్లు, ఓడీ రూపంలో ఇచ్చే పోస్టులకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల సీనియార్టీ ప్రకారం ఇవ్వాలని తెలిపారు. బోధనేతర సిబ్బందికి పది శాతం కోటా కింద జూనియర్ అధ్యాపకులుగా పదోన్నతులు పారదర్శకంగా డీపీసీని నిర్వహించి ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు వంద శాతం సిలబస్‌తో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు బేసిక్ లెర్నింగ్ మెటీరియల్‌ను త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. పేద విద్యార్థులు చెల్లించిన ఫీజుల నుంచి వివిధ రకాల ఫుడ్ అలవెన్సు, రెమ్యూనరేషన్ తీసుకుంటూ బోర్డు అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. అన్ని పరీక్షల విధులరూ ప్రిన్సిపాల్, జేఎల్ అధ్యాపకుల సీనియార్టీ ప్రకారం కేటాయించాలని వివరించారు. ఇంటర్ విద్య వెబ్‌సైట్‌ను అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిప్స్ నాయకులు రవీందర్‌రెడ్డి, బి లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, వస్కుల శ్రీనివాస్, శోభన్‌బాబు, అలీ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.