Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు
- పలు కీలక ఆంశాలు వెల్లడి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మన్నెగూడలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని గోవాలోని కాండోలిమ్ బీచ్‌లో అదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించగా, అందులో పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ప్రధాన నిందితుడైన నవీన్‌రెడ్డి 32 మంది అనుచరులను ఇప్పటికే అరెస్ట్ చేయగా, వారు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. అయితే వారు ఉపయోగించిన కారు శంషాబాద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు లభ్యమైంది. ఆ కారులో కీలక వస్తువులు దొరికాయి. నవీన్‌రెడ్డి అరెస్టుతో ఈ కేసులో అన్ని అంశాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 9న వైశాలి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న నవీన్.. వైశాలిని అపహరించి పెండ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు.
అనుచరులు, టీ స్టాళ్లలో పని చేసే సిబ్బందిని ఇందుకోసం ఉపయోగించుకున్నాడు. యువతి ఇంటి ముందు నిలిపిన 5 కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి సీసీ కెమెరాలు డీవీఆర్లు ఎత్తుకెళ్లారు. వైశాలిని అపహరించి కారులో నల్లగొండ వైపు తీసుకెళ్లారు. తన కోసం పోలీసు వెతుకుతున్నారనే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న నవీన్‌రెడ్డి.. నల్లగొండ వద్ద అతని స్నేహితులు కారు నుంచి దిగిపోయారు. నవీన్ మరో స్నేహితుడు రుమాన్.. వోల్వో కారులో వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఈ నెల 9న సాయంత్రం క్షేమంగా ఉన్నట్టు వైశాలి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.