Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ బీ.ఎన్.త్రిపాఠి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాన్య ప్రజలు ఇప్పటికీ పోషకాహారలోపంతో బాధపడుతున్నారని ఐసీఏఆర్ (న్యూఢిల్లీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీ.ఎన్.త్రిపాఠి తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఐసీఏఆర్-నేషనల్ రీసర్చ్ సెంటర్ ఆన్ మీట్ (చెంగిచెర్ల)లో మాంసంలో సుస్థిరాభివృద్ధి-నూతన సాంకేతికత, విధానాలు అనే అంశంపై నిర్వహించారు. ఈ సందర్బంగా త్రిపాఠి మాట్లాడుతూ నాణ్యమైన ప్రొటీన్ ఉండే పాలు, మాంసం, గుడ్లు వినియోగదారులకు చవక ధరలకు అందించాల్సిన అవసరముందని చెప్పారు. ఇందుకోసం స్థానిక వనరులను ఉపయోగించుకుని జంతువుల ఉత్పాదకతను పెంచేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డాక్టర్ తరుణ్ బజాజ్ మాట్లాడుతూ భారతదేశం ఎగుమతి చేస్తున్న వాటిలో గేదె మాంసం మూడో స్థానంలో ఉందనీ, దీనితో ప్రతి ఏడాది రూ.25 వేల కోట్ల విదేశీ ఆదాయం సమకూరుతుందని చెప్పారు. మధ్య తూర్పు, ఆగేసియా దేశాలకు ఇప్పటికీ నాణ్యత కారణంగా ఎగుమతిపై నిషేధం ఉందని తెలిపారు. ఎగుమతిదారులు నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు, మాంసం రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి, నాణ్యత, చట్టపరమైన చిక్కులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.