Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలతోపాటు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారి క్రిస్టియానో, సాంఘిక సంక్షేమ రాష్ట్ర సహాయ అధికారి ఉమాదేవి, అఖిలేష్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ రాష్ట్ర సహాయ అధికారి చంద్రశేఖర్‌ను బుధవారం హైదరాబాద్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామకృష్ణ, నామాల ఆజాద్ కలిసి వినతిపత్రం సమర్పించారు. నెలల తరబడి వాటిని నిలిపేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలను ఇవ్వడం లేదని తెలిపారు. ఫీజు చెల్లించలేని పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి డైట్, కాస్మొటిక్ ఛార్జీలు, స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయానలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రవీణ్, నాయకులు ఎస్ రాకేష్, శివ ప్రసాద్, పరుశురాం, దీపక్ తదితరులు పాల్గొన్నారు.