Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కె తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్... దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన విప్లవాత్మక పంథాను అనుసరించారని పేర్కొన్నారు. దేశహితం కోసం ఈనాడు నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక అనుమతితోనే హైదరాబాద్లో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయానని పేర్కొన్నారు.