Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌లో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించి 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు 35 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. కాగా టీఎస్ఎంఐడీసీలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్కు కౌన్సిలింగ్ నిర్వహించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.విజయగోపాల్ కరీంనగర్ నుంచి కుత్బుల్లాపూర్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఆదేశించారు.