Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కోర్సులకు సర్కారు అనుమతి
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు మోడల్ గురుకుల పాలిటెక్నిక్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో మూడు కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లుంటాయని వివరించారు. ఈ కాలేజీ ఏర్పాటు కోసం రూ.38.40 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు 63 ఉంటాయని పేర్కొన్నారు.