Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని, యూనివర్సిటీ విద్యార్థులు పరిశోధన రంగం వైపు దృష్టి సారించి గొప్ప వైజ్ఞానికవేత్తలు కావాలని విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ అన్నారు ఎస్ఎఫ్ఐ జాతీయ 17వ మహాసభ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట బుధవారం రాత్రి విజ్ఞాన దర్శిని, సైంటిఫిక్ యూత్ ఫోర్స్ ఓయూ వారి ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మూఢ నమ్మకాలను, బాబాలను నమ్మొద్దని సూచించారు. విజ్ఞానం పెరుగుతున్న వేళ మూత్రం తాగించడం లాంటి ఘటనలు జరగడం ఏంటని ప్రశ్నించారు. మానవులను క్రూరత్వంలోకి నెట్టేస్తూ కొందరు పబ్బం గడువుకోవడం బాధాకరమన్నారు. నేడు యూనివర్సిటీల్లో జోతిష్యం, భూత వైద్య కోర్సులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రదర్శన సందర్భంగా పలువురు మంట లను మింగటం, అంటించుకోవడం, రాసు కోవడం, మంటలపై నడవడం, నీళ్లతో మంటలు వెలిగిం చడం, గాజు పెంకులపై నడవడం, నాలు కకు త్రిశూలం గుచ్చు కోవడం వంటి వైజ్ఞానిక ప్రదర్శ నలు నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని నేతలు శోభారాణి, విష్ణువర్ధన్, విష్ణు, సైంటిఫిక్ యూత్ పోర్స్ ఓయూ నేతలు యస్కార్, మహేష్, సాగర్, ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు సాయి కిరణ్, సహాయ కార్యదర్శి అనంతు శర్మ, స్నేహిత, శ్రావణి, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.