Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్‌పై విచారణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి సిట్ విచారణను రద్దు చేసి సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టు వేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి విచారణ కొనసాగించారు. ఆ పార్టీ తరపున సీనియర్ లాయర్ ప్రభాకర్ వాదనలు పూర్తయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ కోర్టులో సీఆర్పీసీలోని 164 సెక్షన్ కింద నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. కేసులో నిందితుడు, బాధితుడు వంటి వాళ్లే 164 కింద వాంగ్మూలం తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వాంగ్మూలం 164 కింద నమోదు చేయడం అసాధారణమని తెలిపారు. వాంగ్మూలం తారుమారు అవ్వకుండా చేయాలన్న నిబంధన ఫిర్యాదు చేసిన వ్యక్తికి వర్తింపజేయడాన్ని రోహిత్‌రెడ్డితో బలవంతంగా ఫిర్యాదు చేయించారనే అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు.
సిట్ దర్యాప్తును నిలిపివేసి సీబీఐకి ఇవ్వాలంటూ కోరారు. విచారణ గురువారానికి వాయిదా పడింది.