Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు
- మొత్తం 39 మంది నిందితులు అరెస్ట్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు. ముందుగా అతనికి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తరలించినట్టు సమాచారం. కాగా, ప్రేమించిన యువతికి మరొకరితో పెండ్లి నిశ్చయం అవుతుందన్న కక్షతో ఆమెను కిడ్నాప్ చేసిన నవీన్‌రెడ్డి.. మొబైల్ లోకేషన్ ఆధారంగా అతన్ని గోవాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా అతన్ని చెన్నై కోర్టులో హాజరుపరిచగా, బుధవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న 32మందిలో నాగారం బాను ప్రకాష్, రాథోడ్ సాయినాధ్, గానికి ప్రసాద్, కోతి హరి, బోని విస్వేశ్వర్ను కస్టడీ కోరుతూ మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం విచారించిన న్యాయమూర్తి వారి కస్టడీ పిటిషన్ వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులైన చంద్రశేఖర్, ప్రవీణ్, ప్రకాశ్, మహేశ్, యస్వంత్లను కోర్టులో హాజరు పరిచారు. దాంతో రిమాండ్‌కు చేరిన నిందితుల సంఖ్య 37కి చేరింది. నవీన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన మహమ్మద్ వాజిద్ రుమెన్ పరారీలో ఉన్నారు. కాగా, నవీన్‌రెడ్డిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది.