Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే సమ్మె ఉధృతం
- సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రత్యేక జీవోను విడుదల చేసి ఏడాది కాలంగా ఉన్న ఎరియర్స్తో సహా వేతనాలను చెల్లించాలనీ, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ జేఏసీ హెచ్చరించింది. బుధవారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో 14 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్ రాజ్ మాట్లాడుతూ సివిల్ సప్లైస్, జీసీసీ హమాలీల ఎగుమతి, దిగుమతి కాలపరిమితి 2021 డిసెంబర్ తో ముగిసిందనీ, 2022 జనవరి నుంచి రేట్లను పెంచి వర్తింపజేయాలని చేసిన పోరాటాల ఫలితంగా ఆగస్టు 16న నూతన రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.రూ.22 నుంచి రూ.26గా పెంచుతూ, ఇతర సౌకర్యాలను అమలు చేస్తూ నిర్ణయించినా, ఆ రేట్లను అమలు చేయకపోగా, జీవోను కూడా విడుదల చేయలేదని విమర్శించారు. జేఏసీ నాయకులు పాలడుగు సుధాకర్ (సీఐటీయూ) మాట్లాడుతూ కార్మికులను మభ్యపెట్టకుండా కొత్త రేట్లను అమలుచేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం, ప్రమాద బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. సివిల్ సప్లైస్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్ని జీసీసీ హమాలీలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు కె.సూర్యం (ఐఎఫ్ టీయూ) మాట్లాడుతూ సమ్మె విరమించాలని కార్మికులపై ఒత్తిడి తేవడం తగదని హెచ్చరించారు. ముందు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.