Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 వేల కి.మీ రోడ్లకు మరమ్మతులు
- వచ్చే ఏడాది 'మే' నాటికి పూర్తి
- వర్కింగ్ ఏజెన్సీల నిరాసక్తత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వరద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల మరమ్మతుల ప్రక్రియను త్వరితగతిన చేపట్టేందుకు సర్కారు సమాయత్త మైంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. మూడు దశల్లో పూర్తిచేయాలని నిర్ణయి ంచింది. ఈనెల 12న తొలిదశ టెండ ర్లను పూర్తిచేసింది. ఈ సందర్భంగా 200 పనులకు టెండర్లు ఖరారు అయ్యాయి. వీటికి దాదాపు రూ. 600 కోట్ల మేర వ్యయం కానుంది. అలాగే గురువారం రెండోదశ టెండర్లకు చివరి తేదీ. ఇకపోతే మూడో దశ ఈనెల 20న జరగనుంది. రాష్ట్ర వాప్తంగా నాలుగు నెలల క్రితం చోటుచేసుకున్న వరదలకుగాను 33 జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. మొత్తం రాష్ట్రంలోని 27,734 కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్కుగాను, 4020 కిలోమీటర్ల మేరరోడ్లు ధ్వంసమైనట్టు అధికారులు గుర్తించారు. వీటికోసం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సర్కారు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్ల కోసం రూ.1865 కోట్లు, కల్వర్టు లు, బ్రిడ్జీల కోసం మరో రూ.635 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిం దే. రోడ్లు నిర్మాణం, మరమ్మతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరా నికి ప్రభుత్వం రూ.1542 కోట్లు బడ్జె ట్లో కేటాయించిన సంగతి తెలిసిం దే. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో వీటికితోడు అదనంగా మరో రూ. 700 కోట్ల మేర నిధులు మంజూరు చేసినట్టయింది. గత రెండు వారాలు గా దెబ్బతిన్న ఆయా రోడ్లకు మరమ్మ తులు చేసేందుకు ప్రభుత్వం టెండర్ల ను ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం గతంలో చేసిన పనులకే బిల్లులను చెల్లించకపోవడంతో ఇప్పుడు వర్కింగ్ ఏజెన్సీలు టెండర్లను దాఖలు చేసేం దుకు ఆసక్తి చూపడం లేదు. పలువు రు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పనులు చేసేం దుకు కాంట్రాక్టర్లను బతిమిలాడు కోవాల్సి వస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం విదితమే. ఈనెల 20తో మూడు దశల టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఈ నెలాఖరు లోగా రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. 2023 చివర లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యం లో రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభు త్వం భావిస్తున్నది. ఈ తరుణంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి రోడ్ల పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నది. వచ్చే సంవ త్సరం మే నెల నాటికి మొత్తం అన్ని జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు లు పక్కాగా జరిగేలా చూడాలని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారు లు భావిస్తు న్నారు. జిల్లాల్లో టెండర్లకు స్పందన లేదనే విషయమై రోడ్లు, భవనాల శాఖ గ్రామీణ రోడ్ల ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్రావును సంద్రించ గా 'టెండర్లకు స్పందన లేదనేది నిజం కాదు..వేస్తున్నారు. ఈనెల 12న ఒక దఫా పూర్తయ్యాయి. 15, 20 తేదీల్లో మిగతావి అవుతాయి. ఈ నెలాఖరు లోగా అన్ని పనులకు టెండర్లను పూర్తిచేసి మరమ్మతులు చేపడతాం' అని చెప్పారు.