Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ వేదికగా విద్యార్థుల జాతర
- ఏకత్వంలో భిన్నత్వంలా... భిన్నత్వంలో ఏకత్వంలా
- అజరామరం..జాతీయ మహాసభల సంరంభం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
'అక్కడేదో కొలాహాలం..వందలాది మంది విద్యార్థులు.. అటూ, ఇటూ తిరుగుతున్న హడావిడి..కొంగొత్త పరిచ యాలు చేసుకుంటూ కనిపిస్తున్న పరిస్థితి ..ఎప్పుడూ చూడనవి, విభిన్నంగా కొత్త ముఖాలు..దగ్గరకు వెళ్లేకొలది తిరునాళ్లను తలపిస్తున్నది ఆప్రాంతం..భిన్నత్వంలో ఏకత్వంగా.. ఏకత్వంలో భిన్నత్వంగా. వివిధ భాషలు, సంస్కృతులను తలపిస్తున్న వైనం. వెరసీ సంభరం. తరచి చూస్తే ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సంరంభం. ఆ వేదిక ఠాగూర్ ఆడిటోరియం. దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా పెరుతెచ్చుకున్న ఉస్మానియాలో 17వ జాతీయ మహాసభలను జరుపుకుంటున్న నేల. ఒకవైపు తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, మరోవైపు తెలంగాణ చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిత్రపటాలు. ఇంకో దిక్కు విద్యార్థి ఉద్యమాల్లో అసువులుబాసిన అమరవీరుల బొమ్మలు. భారత విద్యార్థి సమాఖ్య. ఎస్ఎఫ్ఐ. ఆ పేరు వింటేనే ఒక పులకింత. విద్యార్థుల్లో ఒకింత తుళ్లింత. అది విద్యార్థులకు తోవచూపే మార్గదర్శి. చదువుతూ పోరాడు..చదువుకై పోరాడు అనే మూలసూత్రంతో విద్యార్థి సమస్యలపై నిరంతరం ఎలుగెత్తే విద్యార్థి సంస్థ. విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదనే మూస భావనల నుంచి వారిని ప్రగతిమార్గంలో పెట్టే సాధనంగా ఎస్ఎఫ్ఐ తన 17వ జాతీయ మహాసభలను ఓయూలో జరుపుకుంటున్నది. అందుకు ఓయూ ఆతిథ్యమివ్వడం చరిత్రే కానుంది. ఒకనాడు ఎస్ఎఫ్ఐ మాట చెబితేనే యూనివర్సిటీ పాలకుల్లో అలజడి. ప్రత్యర్థి విద్యార్థి సంఘాల గుండెల్లో గుబులు. నేడా యూని వర్సిటీ ఎస్ఎఫ్ఐ.. ఎస్ఎఫ్ఐ.. ఎస్ఎఫ్ఐ.. ఎస్ఎఫ్ఐ.. ఎస్ఎఫ్ఐ అని నినదిస్తూ గత మూడు రోజులుగా మార్మోగుతున్న తీరు అజరామరమే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు విదేశీ విద్యార్థి ప్రతినిధులు సైతం మహాసభలకు డెలిగేట్లుగా హాజరై తమ తమ కష్టాలు, బాధలు, ప్రభుత్వాల విధానాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను మహాసభల వేదికగా చర్చిస్తున్న తీరు ఆశ్చర్యంగొల్పుతున్నది. ఆనందమేస్తున్నది. అమ్మ కడుపులో నుంచి బయటకొచ్చే శిశువుకు తొలి గురువు తల్లి. మలి గురువు తండ్రి. ఆతర్వాతే తరగతి గది, ఉపాధ్యాయుడునూ. అయితే ఆ శిశువుకు ఉగ్గుపాలతో చైతన్యం నింపేదే ఎస్ఎఫ్ఐ. తరగతి గది వరకూ తల్లీ, తండ్రీ తీసుకెళతాడు. ఉపాధ్యాయుడు ముందుకు నడిపిస్తాడు. ఆ తర్వాత జీవితాంతం తోడుండేది ఎస్ఎఫ్ఐ. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలతోపాటు ఆయా రాష్ట్రాల నుంచి విద్యార్థినులు భారీ సంఖ్యలో తరలివచ్చిన తీరు అద్భుతమే. ఏ విద్యార్థి నోటా విన్నా ఎస్ఎఫ్ఐ. ఠాగూర్ ఆడిటోరిఎయం వైపే అన్నీ దారులూ. విదేశీ విద్యార్థి ప్రతినిధులు కొందరొచ్చి ప్రసం గిస్తే, రకరకాల కారణాలతో రాలేని మరికొందరు వీడియో సందేశాలు పంపి విద్యార్థులు, వారి సమస్యలను మహా సభల్లో సమగ్రంగా చర్చించడం, పరిష్కారాలను కను గొనడం ద్వారా మహాసభలు జయప్రదం కావాలని కోరు కోవడం మరింత శోభనిచ్చింది. స్వాతంత్య్రం, ప్రజా స్వామ్యం, సామ్యవాదం నినాదాలతో పురుడు పోసుకున్న ఎస్ఎఫ్ఐ, నేడు దేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదగడం ఊరకే జరగలేదు. నిరంతర విద్యార్థిపక్షపాత ఉద్యమాలకు ఊపిరులూదీ, యూనివర్సిటీల్లో కదం తొక్కుతున్నది. ఉస్మానియా నుంచి జేఎన్‌యూ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు విద్యార్థి పోరాటాలను ముందుండి నడిపిస్తున్నది.
నేటి బూర్జువా ప్రభుత్వాలు, కలుషితమైన సిలబస్‌తో విద్యార్థుల మెదళ్లను తుత్తునీయలు చేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో జాతీయ మహా నగరంలో మహాసభలు జరగడం అనూహ్యామేమి కాదు. కొత్త, కొంగొత్త ఆలోచనలతో విద్యార్థి లోకానికి కచ్చితంగా ఈ సభలు మార్గనిర్దేశనం చేస్తాయ నడంలో సందేహాం లేదు. అధికారం కోసం, రాజకీయాల కోసం మత మౌడ్యంతో తరగతి గదులను మతోన్మాదుల వికృత కేంద్రాలుగా మలుస్తున్న తీరుతెన్నులను ఎస్ఎఫ్ఐ అడ్డుకుం టుందనే నమ్మకం, విశ్వాసం ఇక్కడి ప్రతినిధుల చర్చల సారాంశమే. మహానగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ విద్యార్థి శంఖారావానికి ఆనవాళ్లే. అనితర పోరాటపటిమకు నిదర్శనమే.