Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతాంగ ఉద్యమ తరహాలో ఎన్ఈపీని అడ్డుకోవాలి
- సేవ్ ఎడ్యుకేషన్...సేవ్ ఇండియా నినాదంతో ముందుకు
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలో వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాల నేతల పిలుపు
మల్లుస్వరాజ్యం నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాల ద్వారా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాల జాతీయ నాయకులు నొక్కి చెప్పారు. విద్యను కాషాయీకరణ, ప్రయివేటీకరణ చేసే ఎత్తుగడతో తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాన్ని నిర్వహిం చాల్సిన అవసరం ఉందన్నారు. సేవ్ ఎడ్యుకేషన్.. సేవ్ ఇండియా నినాదంతో ముక్తకంఠంగా ముందు కు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మల్లుస్వరాజ్యం నగర్(ఓయూ)లో గల అభిమన్యు- ధీరజ్-అనీష్ఖాన్ వేదికలో సాగుతున్న స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17 మహాసభలకు వారు గురువారం హాజరయ్యారు. తమ సంఘాల తరఫున సౌహార్ధ్ర సందేశాలనిచ్చారు. క్యూబా, బంగ్లాదేశ్, పాలస్తీనాలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు మహాసభలో మాట్లాడారు. పలు దేశాల విద్యార్థి సంఘాల నాయకులు తమ సందేశాన్ని వీడియోల రూపంలో పంపారు.
ఎన్ఈపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం : విక్కీ మహేశరి
న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోనున్నట్టు ఎఐఎస్ఎఫ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విక్కీ మహేశరి అన్నారు. ఢిల్లీలో రైతుల పోరాటాన్ని అణచివేయాలని మోడీసర్కారు చూస్తే వారు ఒక్కడు గు కూడా వెనక్కి వేయలేదన్నారు. రైతుల పోరాట స్ఫూర్తితో ఎన్ఈపీకి వ్యతిరేకంగా ఉద్యమా న్ని వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోతామని చెప్పారు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం పోరాడుతామన్నారు.
జీవించే హక్కును మోడీ సర్కారు కాలరాస్తున్నది : ప్రసేన్జిత్
మోడీ సర్కారు దేశంలో విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నదని ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) నేత ప్రసేన్జిత్ విమర్శించారు. జామియాలో విద్యార్థుల పోరాటాన్ని అణచివేసిందన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నదని విమర్శించారు. ఆదివాసీ, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఆర్ఎస్ఎస్, మోడీ సర్కారు కు అడ్డుకట్ట వేసేందుకు విద్యార్ధి పోరాటాన్ని సంఘ టితంగా ముందుకు తీసుకెళ్తామని హామీనిచ్చారు.
విద్యారంగ ప్రయివేటీకరణకే ఎన్ఈపీ : ఎమ్డీ షఫియుల్లా
మోడీ, అమిత్షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగాన్ని కూడా పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని పీడీఎస్ యూ ప్రధాన కార్యదర్శి ఎమ్డీ షఫియుల్లా విమర్శిం చారు. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగాలనీ, అందులో ఎస్ఎఫ్ఐ కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. సేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్..సేవ్ ఇండియా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. హిందీ, హిందూ, హిందూస్థానీ కోసం బీజేపీ యత్నిస్తున్నదని విమర్శించారు. దీన్ని తిప్పికొట్టేందుకుగానూ అందరికీ తిండీ, బట్ట, ఇల్లు నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఫాసిస్ట్ సంస్కృతి వ్యాప్తి : కె.ఎస్. అశ్విని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నదని ఆలిండియా డెమోక్రటివ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్ఓ) అధ్యక్షులు కేఎస్. అశ్విని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి తన గుప్పిట్లోకి తీసుకుంటున్నదని విమర్శించారు. మహనీయుల చరిత్రను పుస్తకాల నుంచి తప్పిస్తున్నదన్నారు. విద్యార్థులను ఆలోచించకుండా మరయంత్రాలుగా మార్చే విధానానికి పూనుకున్నదని విమర్శించారు. విద్యార్థులను డ్రగ్స్, ఆల్కహాల్, ఇతర వ్యవసనాలకు అలవాటు చేస్తున్న దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యకు బడ్జెట్ కేటాయింపు, ఖర్చు అంతంతేనన్నారు. శాస్త్రీయ విద్యావిధానం, సోషలిజం సాధన దిశగా పోరాటాల కార్యాచరణ ఉండాలని ఆకాంక్షించారు.