Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థ చేస్తున్న సమాజహిత కార్యక్రమాలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ గోల్డ్ మెడల్ ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్..సింగరేణి డైరెక్టర్ . సత్యనారాయణ రావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్, సంజరుకుమార్కు ఆ మెడల్‌ను బహుకరించారు. గురువారం రాజభవన్లో నిర్వహించిన రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో ఈ బహుమతిని అందజేశారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వారు తన సామాజిక బాధ్యతలో భాగంగా మంచిర్యాల జిల్లాలో గల రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకుకు అత్యాధునిక అంబులెన్సును గతేడాది అందజేసింది. ఆ సొసైటీ స్థానిక తలసేమియా, సికిల్‌సన్ వంటి వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయడం కోసం మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటుందని ఈ సందర్భంగా సత్యనారాయణ, సంజరుకుమార్ తెలిపారు. సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుకు పంపడానికి, అలాగే అత్యవసరమైన రోగులకు రక్తం అందించడానికి అంబులెన్స్ అవసరం ఉందనీ, దీన్ని గుర్తించిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర యాజమాన్యం రెడ్‌క్రాస్ సొసైటీకి ఆధునిక ఏసీ అంబులెన్సును బహూకరించిందని పేర్కొన్నారు.