Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో మీడియా సున్నితంగా వ్యవరించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆమెను కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి అరెస్టు తర్వాత విడుదల చేసిన వీడియోలు, చెప్పే విషయాలు వైశాలి వ్యక్తిత్వం, ఆమె భవిష్యత్ మీద దుష్ప్రభావాన్ని కలగజేస్తాయని ఆయన తెలిపారు. అందువల్ల మీడియా సంయమనంతో వ్యవరించి సంచలనాలకు తావివ్వకుండా బాధితురాలు వైశాలి పట్ల సానుభూతితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విషయంలో అధికారికంగా ఇచ్చే సమాచారం మీద ఆధారపడితే సబబుగా ఉంటుందనీ, మీడియా ఓరిమితో వ్యవరించాలని కోరారు.