Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్రంలోనే భూగర్భ జల లభ్యతలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాల అభివృద్ధిలో జిల్లా చాలా ముందంజలో ఉందని, గత రెండు వానాకాలం సీజన్లలో వర్షపాతం అధికంగా నమోదైందన్నారు. పాలమూరు- రంగారెడ్డి లెఫ్ట్ కెనాల్ -2, 3 కింద 52 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోందని తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. గోపాల్పేట, ఘనపూర్ మండలాల్లో 37 కిలో మీటర్ల మేర నీటి వనరులు ఉన్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ అడ్వైజర్ విజరు ప్రకాష్, చీఫ్ ఇంజినీర్లు హమీద్ ఖాన్, రఘునాథ్‌రావు, ఎస్ఈటీ సత్యశిల రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుసూదన్, అధికారులు, నీటి పారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.