Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2, గ్రూప్-4 పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనెల 18,19 తేదీల్లో ఉచిత అవగాహన, డెమో క్లాసులను నిర్వహిస్తున్నట్టు విజయసాధన స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె గంగా కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటల నుంచి గ్రూప్స్ కోచింగ్‌లో తెలుగు రాష్ట్రాల్లో అనుభవజ్ఞులైన ప్రభాకర్‌రెడ్డి, రమేష్ నాయుడు, పాషా, సైదులు దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న తమ స్టడీ సర్కిల్లో వివరిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉచిత అవగాహన, డెమో క్లాసులకు హాజరు కావాలని కోరారు.