Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2018 మ్యానువల్ కొలతలతో ఎత్తును కొలవాలి
- అన్యాయం చేస్తే ఆందోళనలు చేపడుతాం
- కేవీపీఎస్ ,డివైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ పరీక్షల్లో డిజిటల్ కొలతల పేరుతోఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి స్కైలాబ్‌బాబు, ఎ వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2018 నోటిఫికేషన్లో మాన్యువల్ కొలతల్లో అభ్యర్థుల ఎత్తు 168 సెంటీమీటర్లు కాగా వారంతా క్వాలిఫై అయి మెయిన్స్ కూడా రాశారనీ, కానీ ప్రస్తుతం 2022 నోటిఫికేషన్లో డిజిటల్ కొలతలమేజర్ మెంట్లు ఉంటాయనే విషయాన్ని ఎక్కడ పేర్కొనకుండానే ప్రభుత్వం డిజిటల్ కొలతలు మేజర్ మెంట్లు తీసుకొచ్చిందని వివరించారు.
రన్నింగ్, ఇతర వాటిల్లో క్వాలిఫై అయినా ఆ తర్వాత ఇప్పుడు 166 సెంటీమీటర్లు తగ్గించి అనర్హులుగా ప్రకటించటమేంటని ప్రశ్నించారు. దీనివల్ల లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్న వారికి అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. 2018 లో ఎత్త కొలత ఎక్కువగా ఉండి, ఇప్పుడు ఎలా తగ్గుతారని విమర్శించారు. తక్షణమే గత 2018 మాదిరిగానే మ్యానువల్ కొలతలు తీసుకుని అభ్యర్థులకి అన్యాయం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.