Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ సొమ్మును ఎగ్గొట్టే వైఖరి సరికాదు : ఎస్టీయూటీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) నుంచి వైదొలగి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరిం చుకునే రాష్ట్రాలకు పీఎఫ్ఆర్డీఏలో జమ చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేది లేదంటూ కేంద్రంలోని మోడీ ప్రభు త్వం ప్రకటించడం ఎగ్గొట్టే వైఖరికి, అహంకారానికి పరాకాష్ట అని ఎస్టీ యూటీఎస్ విమర్శించింది. ఈ మేర కు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజం గరావు గురువారం ఒక ప్రక టన విడుదల చేశారు. కేంద్రం ఇలాం టి వైఖరితో ఉండడం సరైంది కాదని తెలి పారు. దీంతో 80 లక్షల ఉద్యోగు లను తీవ్ర ఆందోళనకు గురిచేయడ మేనని విమర్శించారు. సీపీఎస్ నుం చి ఎప్పుడైనా వైదొలగే స్వేచ్ఛ, ఓపీ ఎస్‌ను అమలు చేసే అధికారం రాష్ట్రా లకుందని వివరించారు.