Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బిఐ రూ.38.20 లక్షల విరాళం
హైదరాబాద్: చెరువులు, వాగులు, కాలువల నుంచి అపరిశుభ్రమైన నీటిని తాగుతున్న గిరిజనులకు రక్షిత మంచినీటిని అందించడానికి ఎస్బిఐ అమరావతి సర్కిల్ రూ.38.20 లక్షలు విరాళంగా అందించింది. ఈ ప్రాజెక్ట్ మారేడిమిల్లి సమీపంలోని దండకారణ్యంలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలోని 20 గిరిజన గ్రామాల్లో చేతి పంపులతో 20 లోతైన బోర్వెల్లను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందిస్తుంది. ఈ గ్రామాల్లోని గిరిజనులు సురక్షితమైన తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు, రక్షిత మంచినీరు లేక చెరువులు, వాగులు, కాల్వలపై ఆధారపడి అపరిశుభ్రమైన నీటిని తీసుకువస్తున్నారు. ఆయా గ్రామాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కింద ఎస్బిఐ ఈ సాయం అందించింది. బుధవారం సాయంత్రం గన్‌ఫౌండ్రీలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అమరావతి చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్‌చంద్ర ఝా సమక్షంలో అవేర్ ఎన్‌జిఒ చైర్మన్ డాక్టర్ పికెఎస్ మాధవన్‌కు ఆ బ్యాంక్ ఐబి, జిఎం అండ్ టి మేనేజింగ్ డైరెక్టర్ చల్లాశ్రీనివాసులు సెట్టి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్, ఇతర జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.