Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోటల్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ అయిన టోటల్ ఎనర్జీస్ మార్కెటింగ్ ఇండియా తెలంగాణలో తన 100వ ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ''రవాణా ఇంధనంగా ఆటో ఎల్పిజి అనేక సాటిలేని ప్రయోజనాలను అందిస్తుంది. వాహన ఉద్గారాల కారణంగా నగరాల్లో గాలి కలుషితం కావడం అనే తక్షణ సమస్యకు తక్షణ పరిష్కారం ఇది. రిటైల్ మార్కెటింగ్‌లో టోటల్ ఎన ర్జీస్ ప్రపంచ నైపుణ్యంతో మేం దక్షిణ భారతదేశంలోని మా అన్ని స్టేషన్ లలో అత్యుత్తమ ఉత్పత్తి నాణ్యతను, సాటిలేని కస్టమర్ అనుభవాన్ని అందిస్తాం'' అని ఆ సంస్థ సిఎండి ఒలివియర్ సబ్రీ పేర్కొన్నారు.