Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాసంస్థల్లో ప్రజాస్వామిక హక్కులపై దాడి
- ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడమే మా లక్ష్యం : ఎస్ఎఫ్ఐ పశ్చిమబెంగాల్ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య
నవతెలంగాణ బ్యూరో - మల్లు స్వరాజ్యం నగర్ (హైదరాబాద్)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020పై తృణ మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వానికి ఎలాంటి వైఖరి లేదని ఎస్ఎఫ్ఐ పశ్చిమ బెంగాల్ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్ఈపీని స్వాగతిం చడం లేదు, వ్యతిరేకిం చడం లేదని చెప్పారు. అందువల్ల ఆ పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో నిర్వహిం చిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకు హాజరైన శ్రీజన్ భట్టాచార్య గురువారం నవతెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు... 'బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు విద్యారంగాన్ని వికేంద్రీకరిం చింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విద్యార్థులం దరికీ పాఠశాలలు, కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. పేదలు చదువుకునేలా చేసింది. అక్షరాస్య త 24 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. 99 శాతం మంది విద్యార్థులు బడుల్లో నమోదయ్యారు. బాల్యవివాహాలు తగ్గాయి. బాలకార్మికుల వ్యవస్థ లేకుండా పోయింది. విద్యాప్రగతిలో నాలుగో స్థానంలో ఉండేది. టీఎంసీ అధికారంలోకి వచ్చాక 17వ స్థానానికి దిగజారింది. వామపక్ష ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో నిధులు 18 శాతం కేటాయించింది.
టీఎంసీ ప్రభుత్వం 16.8 శాతం ప్రతి పాదించింది. మా రాష్ట్రంలో ప్రయివేటు విద్యా సంస్థలు, యూనివర్సిటీలు పెరిగాయి. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్యాపకుల్లేరు, వసతుల్లేవు. ఉపాధ్యాయ నియామకాల్లో కుంభ కోణం జరిగింది. విద్యామంత్రి, అధికారులు జైల్లో ఉన్నారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను తగ్గిస్తున్నారు. కన్యశ్రీ పథకం పేరుతో అమ్మాయిల చదువు కోసం ఏటా రూ.20 వేలు ప్రభుత్వం ఇస్తున్నది. కానీ తల్లిదండ్రులు ఆ సొమ్ము ను అమ్మాయిల పెండ్లి కోసం దాచిపెడు తున్నారు. దానిపై పర్యవేక్షణ లేదు. బ్యాలవివాహాల్లో ఇప్పుడు బెంగాల్ రెండోస్థానానికి చేరింది. విద్యార్థి సంఘాల కు ఎన్నికలను నిర్వహించడం లేదు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ గెలిచింది. విద్యా సంస్థల్లో ప్రజాస్వామిక హక్కులపై దాడి జరుగు తున్నది. సుదీప్తో గుప్తో, సైఫుద్దీన్మొల్లను టీఎంసీ గూండాలు హత్య చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. నిధులు కేటాయించాలి. ఖాళీలను భర్తీ చేయాలి. ఫీజుల భారాన్ని తగ్గించాలి. హాస్టళ్లలో ఉండే సమస్యలను పరిష్కరించాలి. వాటి పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమిస్తాం.'అని శ్రీజన్ భట్టాచార్య చెప్పారు.