Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తాం
- విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ సర్కారు
- నవతెలంగాణతో త్రిపుర కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు నిరంజన్ దత్తా
నవతెలంగాణ ప్రతినిధి - మల్లు స్వరాజ్యం నగర్ (హైదరాబాద్)
త్రిపురలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి సంఘ్పరివార్ శక్తులు తమపై దాడులు చేసినా భయపడేది లేదని త్రిపుర కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు నిరంజన్ దత్తా అన్నారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఉస్మాని యా విశ్వవిద్యాలయం (ఓయూ)లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకు హాజరైన నిరంజన్ దత్తా నవతెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...'త్రిపురలో ఐపీఎఫ్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం 2018లో అధికారంలో వచ్చింది. అప్పటి నుంచి తిరోగమన విధానాలను అవలంభిస్తున్నది. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థుల్లో కి మనువాద భావజాలాన్ని తీసుకెళ్లేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నది. అందులో భాగంగా పాఠ్యాంశాలను మారుస్తున్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)- 2020ని అమలు చేస్తే పేద విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీలు తీవ్రంగా నష్టపోతారు. అమ్మాయిలు చదువుకు దూరమవు తారు. ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత నిర్వీర్యమవు తాయి. విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీ కరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ పెరుగు తుంది. విద్యపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం చెలాయిస్తుంది. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమే అవుతుంది. అయినా త్రిపుర ప్రభుత్వం ఎన్ఈపీ అమలుకే మొగ్గు చూపు తున్నది. ఎన్ఈపీ అమలుకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమిస్తాం. త్రిపురలో అరాచక పాలన సాగుతున్న ది. బీజేపీ గూండాలు ఎస్ ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తు న్నారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు. నిరసన తెలియజేయకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తు న్నారు. నాపై రెండు, మూడు సార్లు భౌతిక దాడి జరిగింది. అయినా ఎస్ఎఫ్ఐ జెండాను వీడలేదు. మేము మా కోసం పోరాటం చేయడం లేదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం కొట్లాడు తున్నాం. నిజాయితీగా పనిచేసే మాకు భయం ఎందుకుంటుంది. త్రిపురలో లెనిన్తో పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకుల విగ్రహాలను బీజేపీ గూండాలు ధ్వంసం చేశారు. అవి విగ్రహాలు మాత్రమే కాదు ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్మించాలంటూ సందేశమిస్తాయి. అందుకే వాటిని చూసి తట్టుకోలేక ధ్వంసం చేశారు. అయినా ఆశయం కోసం పనిచేసే మేము ఉద్యమాన్ని ముం దుకు తీసుకుపోతాం.'అని నిరంజన్ దత్తా చెప్పారు.