Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వద్థామరెడ్డి, తిరుపతికి టీఎమ్యూ పేరు చెప్పే అర్హత లేదు
- కేసీఆర్ సారథ్యంలో టీఎమ్యూ ప్రయాణం
- టీఎమ్యూ నూతన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏ.ఆర్ రెడ్డి, థామస్ రెడ్డి
నవతెలంగాణ - సిటీబ్యూరో
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒక్కటేనని.. మరో వర్గం లేదని, అశ్వద్థామరెడ్డి, తిరు పతికి టీఎమ్యూ పేరు చెప్పే అర్హత లేదని టీఎమ్ యూ నూతన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.ఆర్.రెడ్డి, థామస్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో టీఎమ్యూ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తరలి వచ్చి.. టీఎంయూకు ఏకపక్ష మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను, సంస్థను నిట్ట నిలువునా ముచ్చింది అశ్వద్థామరెడ్డి, తిరుపతి లేనని విమర్శించారు. యూనియన్ ఆఫీస్ కడతామని రూ.కోటి 75 లక్షలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నుంచి చందా రూపంలో వసూలు చేసిన డబ్బులు టీఎమ్యూకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె సమయంలో 31మంది కార్మికులు చనిపోతే ఒక్క కుటుంబాన్నీ పరామర్శించే సోయి లేకపాయే.. కనీసం చనిపోయిన ఆ కార్మిక కుటుంబాలను ఆదుకునేం దుకు ఆర్థిక సహాయం ప్రకటించలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉందని, ప్రభుత్వానికి, కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తు న్నామన్నారు.ముఖ్యమంత్రి సారథ్యంలో టీఎమ్యూ ప్రయాణిస్తుందని తెలిపారు. మును గోడు ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చాక సీఎం, మంత్రులను కలుస్తామని, పీఆర్సీ, డీఏ సాధించుకుంటామని తెలిపారు.
టీఎమ్యూ నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన ్(టీఎమ్యూ) జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మొత్తం 66 మందితో కమిటీని ఏర్పాటు చేయగా.. టీఎమ్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ.ఆర్.రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా థామస్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కమలాకర్ గౌడ్, ముఖ్య ఉపాధ్యక్షులుగా జీపీఆర్ రెడ్డి, పీఎస్ రెడ్డి, ఎల్.మారయ్య, బి.యాదయ్య, జాయింట్ సెక్ర టరీలుగా బి.నరేందర్, ఎల్.బి.రెడ్డి, రాఘవరెడ్డిని ఎన్నుకున్నారు.