Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వివిధ యూనివర్సీటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని నాంపల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీసీపీ ఎం.రాజేష్ చంద్రా మీడియాకు వివరాలు వెల్లడించారు.
నాంపల్లికి చెందిన మొహ్మద్ ఎహ్తేషామ్ ఉద్దీన్ హుస్సేయిన్, టోలిచౌకీకి చెందిన మొహ్మద్ అబ్దుల్ ఖాదర్, అంబర్‌పేటకు చెందిన మొహ్మద్ ఇమ్రాన్‌తో పాటు మరో ఇద్దరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. మొహ్మద్ ఎహ్తేషామ్ ఉద్దీన్ హుస్సేయిన్ నాంపల్లి లో 'స్టడీ అఫైర్స్ ఇంటర్నేషనల్ ప్రయివేటు లిమిటెడ్' పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. యూకే నుంచి తిరిగొచ్చిన ఇమ్రాన్ అంబర్‌పేటలో 'వీర సిటీ సర్వీసెస్' పేరుతో మీ సేవాను నడిపిస్తు న్నాడు. మలక్‌పేట్‌కు చెందిన ఆల్తాఫ్ 'క్యారియర్ వింగ్' కన్సల్టెన్సీని హిమాయత్ నగర్లో నిర్వహిస్తు న్నాడు. మొహ్మద్ ఎహ్తేషామ్ ఉద్దీన్ హుస్సేయిన్ తన వద్ద పనిచేస్తున్న ఖాదర్‌తో కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. నిరుద్యోగులకు, విద్యార్థులకు, విదేశాలకు వెళ్లేవారికి అవసరమైన విద్యార్హత నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అందిస్తే సులువుగా డబ్బులు సంపా దించొచ్చని ఆలోచిం చారు. ఈ మేరకు ఇతర రాష్ట్రా లకు చెందిన వారితో స్నేహం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ స్కూల్, చెన్నైకి చెందిన అన్నా యూనివర్సిటీ, తమిళనాడుకు చెందిన తిరువల్లువర్ విశ్వవిద్యాల యం, సత్యభామ విశ్వవిద్యాలయం, మీరట్‌కు చెందిన చరణ్‌సింగ్ యూనివర్సిటీ, పూణే, సిక్కిం, గుజరాత్‌తోపాటు తదితర రాష్ట్రాలకు చెందిన యూని వర్సిటీల సర్టిఫికెట్లను తయారీ చేస్తున్నారు. అవసర మైన వారికి రూ.50వేల నుంచి లక్ష వరకు విక్రయి స్తున్నారు. సమాచారం అందుకున్న ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర డీసీపీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా వేశారు. ఎస్ఐలు కె.నర్సింహులు, వి.నరేం దర్, ఎన్.శ్రీశైలం, షేక్ బురాన్తోపాటు నాంపల్లి పోలీ సులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధ మున్న వారిని, పరారీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు.