Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశంలోని ప్రాజెక్టుల పరిధిలో ఉండే కాలువల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. దీనికి నేషనల్ బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషీయెన్సీ కమిటీగా నామకరణం చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు గోదావరి నదీ యాజమా న్య బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మెన్ సిన్హా అధ్యక్షత వహిస్తారు. అలాగే ఈ టాస్క్‌ఫోర్స్‌లో కమిటీ సభ్యుడిగా రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆయకట్టు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్‌ను సభ్యుడిగా కేంద్రం ఎంపిక చేసింది. ప్రాజెక్టుల పరిధిలోని కాలువల నీటి వినియోగసామర్ధ్యాన్ని పెంచడానికి అవసరమైన అధ్యయనం చేసి కేంద్ర జలశక్తి శాఖకు నివేదికను అందజేస్తుదని రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆయకట్టు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.