Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్యూర్ ఇవి కొత్తగా కమ్యూట్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ ఎకోడ్రిఫ్ట్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ఈ బైకులను పూర్తిగా భారత్లోనే రూపకల్పన, అభివద్ధి, తయారీ చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ బైక్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని వెల్లడించింది. ఇందులో 3.0 కిలోవాట్ హవర్ పేటెంటెడ్, ఎఐఎస్ 156 సర్టిఫైడ్ బ్యాటరీ వ్యవస్ధను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది. కాగా.. దీని ధరను వెల్లడించలేదు.