Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐటీ కెరీర్ ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే బైట్‌ఎక్స్‌ఎల్ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. శుక్రవారం హైటెక్‌సిటీలో దీన్ని లాంఛనంగా తెరిచింది. ఏడు రాష్ట్రాలలో 90కి పైగా ఇన్స్ట్యూట్లతో కలిసి లక్ష మందికి పైగా విద్యార్ధులకు నూతన సాంకేతికతతో కూడిన క్లౌడ్, ఎఐ, ఎంఎల్, డెవ్ఆప్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీలను హైబ్రిడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్, గైడెడ్ కెరీర్ యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. మార్చి 2023 నాటికి తమ ప్రస్తుత 163 మంది పూర్తి కాలం ఉద్యోగులు, కన్సల్టెంట్ల సంఖ్యను 250కు చేర్చనున్నట్లు వెల్లడించింది.