Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరల శ్రేణీ రూ. 347 - 366
హైదరాబాద్: ఫిన్ టెక్ సంస్థ కెఫిన్ టెక్నాలజీస్ డిసెంబర్ 19న ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానున్నట్టు ప్రకటించింది. ఈ ఇష్యూలో షేర్ల ధరల శ్రేణీని రూ.347-366గా నిర్ణయించినట్టు తెలిపింది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెఫిన్ టెక్నలాజీస్ ఎండీ, సీఈఓ శ్రీకాంత్ నాదేళ్ల మాట్లాడుతూ.. ఈ ఇష్యూ డిసెంబర్ 19-21 వరకు తెరిచి ఉంటుందన్నారు. ఒక బిడ్లో కనీసం 40 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఇష్యూ ద్వారా రూ.1,500కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 16న ఇష్యు తెరిచి ఉంటుందన్నారు.