Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
టీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి , సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌లకు తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలన బీజేపీకి చెందినవారిపై సిట్ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈడీ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా, 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన సాగించిన వ్యాపారాలు, పెట్టుబడులకు సంబంధించి వివరాలను ఈడీ కోరినట్టు తెలుస్తున్నది. అంతేగాక, ఆయన పూర్తి బయోడేటాను కూడా ఇవ్వాలని ఈడీ కోరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, బెంగళూరులో చోటు చేసుకున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. గతంలో రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలున్న విషయమై అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. ందులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ప్రముఖ నటి చార్మి మొదలుకొని పలువురు నటులు, సాంకేతిక నిపుణులను ఎన్ఫోర్స్మెంట్కు చెందిన సిట్ అధికారులు విచారణ జరిపి తర్వాత కోర్టులో చార్జిషీటు వేశారు.