Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఈ నెల 28న భద్రాచలం విచ్చేస్తున్న రాష్ట్రపతి మూర్ముని కలిసి స్థానిక సమస్యలు విన్నవించడానికి సీపీఐ(ఎం) సిద్ధంగా ఉన్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి.నర్సారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లడం నియోజకవర్గ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలపై ఉన్నదని, ఆ బాధ్యతతో సీపీఐ(ఎం) కూడా కలుస్తుందని వివరించారు. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదిస్తామని తెలిపారు. ముఖ్యంగా భద్రాచలంలో ఉన్న ప్రధాన సమస్యలైన ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలపాలని, భద్రాచలం అభివృద్ధికి బడ్జెట్లో కేటాయిం పులు సక్రమంగా ఉండాలని, దేశవ్యాప్తంగా సందర్శ కులు భద్రాచలంకి నేరుగా చేరుకునేలా పాండు రంగాపురం రైల్వే లైన్ సారపాక వరకు పొడిగిం చాలని కోరతామన్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఇప్పటి వరకు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని, గుడి అభివృద్ధికి నిధులు, రామాయణం సర్క్యూట్లో భాగంగా భద్రాచలాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు జరపాలని తదితర ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలవనున్న ట్టు తెలిపారు.
ఈ ప్రయత్నానికి స్థానిక శాసనసభ్యు లు కూడా బాధ్యత వహించి అన్ని పక్షాలను కలుపుకొని రాష్ట్రపతిని కలిసే బాధ్యత తీసుకోవాలని సీపీఐ(ఎం) కోరుతుందని పేర్కొ న్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఉన్న పెను ముప్పును రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లడం ద్వారా రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను కేంద్రం సమన్వయం చేయటానికి ఉపయోగ పడుతుందని తెలిపారు. తద్వారా భద్రాచలానికి మేలు జరుగుతుందని, దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రా చలాన్ని, రామున్ని రాష్ట్రపతి సందర్శించడం మంచిదేనని తెలిపారు. పలు సమస్యలపై ఇచ్చే వినతిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి రాష్ట్రపతి పూనుకోవాలని సీపీఐ(ఎం) కోరుతుందని తెలిపారు.